
నిస్సాన్ మోటార్ ఇండియా బుధవారం న్యూ నిస్సాన్ మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.కాంపాక్ట్ మాగ్నైట్‌లో ఇది ప్రీమియం వెర్షన్. బ్లాక్-థీమ్‌లో ఈ బండిని తీసుకొచ్చారు. దీని ధర రూ.8.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో స్టైలిష్ బ్లాక్ ఇంటీరియర్, జపనీస్- స్టైల్‌లోని డిజైన్ ఉన్నాయి. రూ.11 వేలతో బుకింగ్ చేసుకోవచ్చు. నిస్సాన్ డీలర్‌షిప్‌ల ద్వారా లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో రిజర్వ్ చేయొచ్చు.
ధర(ఎక్స్-షోరూమ్, ఇండియా)
వేరియంట్ ధర
1.0 NA పెట్రోల్ MT కురో ఎడిషన్ రూ.8.30 లక్షలు
1.0 NA పెట్రోల్ AMT కురో ఎడిషన్ రూ.8.90 లక్షలు
1.0 టర్బో పెట్రోల్ MT కురో ఎడిషన్ రూ.9.70 లక్షలు
1.0 టర్బో పెట్రోల్ CVT కురో ఎడిషన్ రూ.10.60 లక్షలు