చిన్న కంపెనీలకు రూ. లక్ష కోట్లతో ఫండ్‌

చిన్న కంపెనీలకు రూ. లక్ష కోట్లతో ఫండ్‌

న్యూఢిల్లీ: లాక్‌‌డౌన్‌‌ వల్ల నష్టపోయిన చిన్న వ్యాపారాలకు  సాయం చేయడానికి రూ. లక్ష కోట్ల ఫండ్‌‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఎంఎస్‌‌ఎంఈల మంత్రి‌‌ నితిన్‌‌ గడ్కరి చెప్పారు. మైక్రో, స్మాల్‌‌, మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజ్‌‌ల బకాయిలను క్లియర్‌‌‌‌ చేయడానికి, ఈ కంపెనీలు కరోనా క్రైసిస్‌‌ను తట్టుకోవడానికి ఈ ఫండ్‌‌ ఉపయోగపడుతుందన్నారు.  ‘మేము రూ. లక్ష కోట్లతో ఓ ఫండ్‌‌ను సిద్ధం చేస్తున్నాం. దీనికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌‌ కల్పిస్తుంది. ఈ ఫండ్‌‌ ఉండడం వలన  ఆలస్యమైన ఎంఎస్‌‌ఎంఈ పేమెంట్లను బ్యాంకులు రిలీజ్‌‌ చేయగలుగుతాయి’  అని అసోచామ్‌‌ మెంబర్లతో గడ్కరీ అన్నారు. చిన్న వ్యాపారాలకు అవసరమైన రిలీఫ్‌‌ను ఈ ఫండ్‌‌ అందిస్తుందని చెప్పారు. ఈ ఫండ్‌‌కు ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ, యూనియన్‌‌ కేబినెట్ అనుమతి అవసరమని చెప్పారు.  ‘ రూ. లక్ష కోట్ల ప్యాకేజి నా చేతుల్లో లేదు. ఈ ఫండ్‌‌కు రూ. 1,500 కోట్లతో బీమా చేయడానికి రెడీగా ఉన్నా. కానీ ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ, కేబినేట్‌‌ అనుమతులు రావాలి’ అని చెప్పారు. కార్యకలాపాలను ప్రారంభిస్తున్న కంపెనీలు సోషల్‌‌ డిస్టెన్స్‌‌ రూల్స్‌‌ను కచ్చితంగా పాటించాలని గడ్కరి పేర్కొన్నారు.   ఈ ఫండ్‌‌పై ప్రభుత్వం ఇంకా కసరత్తు చేస్తోందని అధికారులు వివరించారు.