కొండ ప్రాంతాల్లో రోప్​వే ప్రాజెక్టులకు ఇంపార్టెన్స్​ ఇస్తాం

కొండ ప్రాంతాల్లో రోప్​వే ప్రాజెక్టులకు ఇంపార్టెన్స్​ ఇస్తాం

న్యూఢిల్లీ:  ప్రజలకు మరింత చౌకగా రవాణా సదుపాయాలను అందుబాటులోకి తేవడానికి   కరెంటు ఆధారిత టెక్నాలజీ కోసం చూస్తున్నామని కేంద్ర హైవేలు, రోడ్డు ట్రాన్స్​పోర్టు శాఖల మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. ఇందుకోసం ఫిజికల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈవీ ఫ్యాక్టరీ టెక్నాలజీ, రెట్రోఫిట్టింగ్​ ఇండస్ట్రీల ఆర్​ అండ్​ డీ లతో కలసి పనిచేయాలని అమెరికా కంపెనీలను కోరారు. త్వరలో ఈవీల బ్యాటరీ స్వాపింగ్​ పాలసీని, స్టాండర్డ్స్​ను ప్రకటిస్తామని వెల్లడించారు.  రద్దీ, కొండ ప్రాంతాల్లో రోడ్లు వేయడం కంటే రోప్​వే ప్రాజెక్టులకు ఇంపార్టెన్స్​ ఇస్తామని చెప్పారు. జమ్మూ, కాశ్మీర్​, ఉత్తరాఖండ్, హిమాచల్​ప్రదేశ్​, హనిపూర్​, సిక్కిం​లో 11 రోప్​వేలను నిర్మిస్తామని ప్రకటించారు. ‘రీబిల్డింగ్​ ఇన్​ఫ్రా ఫర్​ ఇండియా 2.0’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కంపెనీలను, ఎన్​ఆర్​ఐలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రోప్​వేల కోసం ఉపయోగించే కేబుల్​ కార్​ టెక్నాలజీ కోసం ఇది వరకే కొన్ని కంపెనీలు తనను సంప్రదించాయని చెప్పారు. తనకు లైట్ రైల్​ ట్రాన్స్​పోర్టు టెక్నాలజీలపై పనిచేయడం ఇష్టమని అన్నారు. అన్ని పోర్టులు, జలాశయాల మధ్య వేగవంతమైన రవాణా కోసం పోర్ట్​ కనెక్టివిటీ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 2,050 కిలోమీటర్ల మేర 65 ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. నేషనల్ హైవేలపై ఫైటర్​ ప్లేన్లను ల్యాండ్​ చేయడానికి 29 ఎమర్జెన్సీ ల్యాండింగ్​ ఫెసిలిటీని ఏర్పాటుచేస్తున్నామని గడ్కరీ వెల్లడించారు. ఇలాంటి ప్రాజెక్టుల్లో భారీగా ఇన్వెస్ట్​ చేయాలని అమెరికా కంపెనీలను కోరారు. టెక్నోక్రాట్లు సాయపడితే ఇండియాకు బెస్ట్​ ట్రాన్స్​పోర్టు సిస్టమ్​ను తయారు చేయవచ్చని మంత్రి అన్నారు. ఇలాంటి ప్రాజెక్టుల కోసమే రోడ్​ సెక్టార్​లో 100 శాతం ఫారిన్ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్లకు అనుమతులు ఇచ్చామని నితిన్​ గడ్కరీ వివరించారు.