గోవా బీజేపి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయనున్న నితిన్ గడ్కరి

గోవా బీజేపి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయనున్న నితిన్ గడ్కరి
  • హాజరు కానున్న బీజేపి ముఖ్య నాయకులు

పనాజీ/గోవా:  గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపి ఎన్నికల మేనిఫెస్టోని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఈ రోజు రిలీజ్ చేయనున్నట్లు బీజేపి ఓ ప్రకటనలో తెలిపింది. గత ఆదివారం జరగాల్సిన మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమం.. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అకాల మరణం వల్ల వాయిదా పడినట్లు బీజేపి తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమం ఉంటుందని బీజేపి వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, రాష్ట్ర టూరిజం అండ్ పోర్ట్స్ మినిస్టర్ శ్రీపద్ నాయక్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపి గోవా ఎన్నికల ఇంచార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర రైల్వే అండ్ టెక్స్టైల్ శాఖ సహాయ మంత్రి దర్శన్ జార్దోష్, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ శెట్ తన్వాడే, గోవా డెస్క్ ఇంచార్జ్ సీటి రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు బీజేపి తెలిపింది.

మరిన్ని వార్తల కోసం

వ్యాక్సినేషన్​ జల్దీ పూర్తి కావాలె

317పై అప్పీల్స్ అన్నీ పక్కకే!