IND vs ENG 2025: తెలుగోడి తడాఖా.. ఒకే ఓవర్లో ఇంగ్లాండ్ ఓపెనర్లను ఔట్ చేసిన నితీష్

IND vs ENG 2025: తెలుగోడి తడాఖా.. ఒకే ఓవర్లో ఇంగ్లాండ్ ఓపెనర్లను ఔట్ చేసిన నితీష్

ఇంగ్లాండ్ పై జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో చెలరేగుతున్నాడు. పేస్ కు అనుకూలించే పపిచ్ పై తన స్వింగ్ తో బెంబేలెత్తిస్తున్నాడు. తాను బౌలింగ్ చేస్తున్న తొలి ఓవర్లోనే మ్యాజిక్ చేసి రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రమాదకర ఇంగ్లాండ్ ఓపెనర్లను 14 ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో ఇద్దరినీ ఔట్ చేసి టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ ప్రస్తుతం తొలి రోజు తొలి సెషన్ లో 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (10), పోప్ (1) ఉన్నారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డికి రెండు వికెట్లు దక్కాయి.

14 ఓవర్లో మ్యాజిక్:

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఫాస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. దీంతో 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. ఈ దశలో టీమిండియాకు నితీష్ బ్రేక్ ఇచ్చాడు. 13 ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23) ను ఔట్ చేసి భారత జట్టుకు తొలి వికెట్ అందించాడు. నితీష్ వేసిన వైడ్ డెలివరీకి డకెట్ మోసపోయాడు. లెగ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్ క్రాలీ (18) ని సూపర్ డెలివరీతో ఔట్ చేశాడు. 

బంతి పిచ్ ఇన్ లైన్ మీద పడి అనూహ్యంగా స్వింగ్ ఇన్ స్వింగ్ అయింది. క్రాలీ బంతిని అంచనా వేసేలోపే బ్యాట్ ఎడ్జ్ కు బాల్ తగిలి వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ వెళ్ళింది. దీంతో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి తొలి సెషన్ లో కాస్త వెనకపడింది. ఈ టెస్ట్  ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఒక మార్పుతో బరిలోకి దిగింది. తొలి రెండు టెస్టులకు దూరమైన ఆర్చర్.. జోష్ టంగ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. టీమిండియా విషయానికి వస్తే ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ప్రసిద్ కృష్ణ స్థానంలో బుమ్రా ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు.  

ALSO READ : సాహసమనే చెప్పాలి: టెన్నిస్ ఫేమస్ షాట్ క్రికెట్‌లో పరిచయం చేస్తా: సూర్య కుమార్ యాదవ్