
క్రికెట్ లో ఇన్నోవేటివ్ షాట్స్ ఆడాలంటే సూర్య కుమార్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఏబీ డివిలియర్స్ తర్వాత మిస్టర్ 360 ప్లేయర్ గా సూర్య క్రికెట్ లో పేరు సంపాదించాడు. క్రీజులో స్వేచ్ఛగా కదులుతూ.. శరీరాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతూ స్విచ్ షాట్లు, రివర్స్ స్వీప్‌లు, అప్పర్ కట్‌లతో బౌండరీలు కొట్టి ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాడు. ముఖ్యంగా స్లాగ్ స్వీప్స్ ఆడడంలో సూర్య తనకు తానే సాటి. బుధవారం (జూలై 9) ఇంగ్లాండ్ లో సూర్య కుమార్ యాదవ్ అతని భార్యతో వింబుల్డన్ మ్యాచ్ కు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఒక షాట్ క్రికెట్ లో ఆడాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు.
34 ఏళ్ల ఈ టీమిండియా టీ20 కెప్టెన్ టెన్నిస్ పరిభాషలో 'ట్వీనర్' అని పిలువబడే షాట్ ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఆటగాడు వెనుకకు పరిగెత్తి కాళ్ళ మధ్య నుండి బంతిని కొట్టినప్పుడు దీనిని 'ట్వీనర్' అని పిలుస్తారు. టెన్నిస్ లో ఎంతో ప్రాక్టీస్ ఉంటేనే ఈ షాట్ ఆడగలరు. కానీ క్రికెట్ లో ఈ షాట్ ఆడాలంటే సాహసమనే చెప్పాలి. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ పై టీమిండియా సిరీస్ రద్దు కావడంతో సూర్య అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ లో కనబడనున్నాడు. ఒకవేళ ఆగస్టు లో శ్రీలంకతో టీ20 సిరీస్ ఉంటే ఈ టీమిండియా టీ20 కెప్టెన్ ఈ సిరీస్ లో కనిపించనున్నాడు.
ALSO READ : Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్‌లో సూర్యవంశీ క్రేజ్.. 14 ఏళ్ళ కుర్రాడి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆరు గంటల డ్రైవింగ్
సూర్య కుమార్ కు ఇటీవలే గురువారం (జూన్ 26) జర్మనీలోని మ్యూనిచ్‌లో సూర్య స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ‘కుడి వైపు పొత్తి కడుపులో ఉన్న హెర్నియాకు డాక్టర్లు విజయవంతంగా సర్జరీ చేశారు. మూడేళ్లలో సూర్యకుమార్‌కు ఇది మూడో సర్జరీ. 2023లో చీలమండకు ఆపరేషన్ చేయించుకున్న అతను 2024లోనూ స్పోర్ట్స్ హెర్నియాకు చికిత్స తీసుకున్నాడు. సర్జరీ చేయడంతో ఈ టీమిండియా టీ20 కెప్టెన్ ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
Indian T20I Captain Suryakumar Yadav and his wife at Wimbledon 🤍 pic.twitter.com/EX1TsNRVOK
— Johns. (@CricCrazyJohns) July 9, 2025