ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు సన్నాహాలు జరుగుతున్నాయి. నవంబర్ 19 లేదా 20వ తేదీన సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ పదోసారి ప్రమాణస్వీకారం చేసినట్లవుతుంది. పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సోమవారం ( నవంబర్ 17 ) నితీష్ కుమార్ అద్యక్షన నిర్వహించబోయే క్యాబినెట్ సమావేశంలో 17వ శాసన సభ రద్దు తీర్మానాన్ని ఆమోదించనుంది క్యాబినెట్. అలాగే రేపు గర్వర్నర్ కు రాజీనామాను అందించనున్నారు నితీష్ కుమార్. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎన్డీఏ ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరుతుంది ఎన్డీఏ.
