మహాఘట్బంధన్ సర్కారుకు ఇవాళ విశ్వాస పరీక్ష

మహాఘట్బంధన్ సర్కారుకు ఇవాళ విశ్వాస పరీక్ష


బిహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ సర్కారు ఇవాళ విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు. ఆయనను పదవి నుంచి దింపేయాలని మహాకూటమి నిర్ణయించింది. ఇప్పటికే స్పీకర్ పై అవిశ్వాస తీర్మనం ప్రవేశపెట్టింది. కాగా బలపరీక్షకు ఒక్కరోజు ముందు స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసత్య ఆరోపణలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారని.. శాసన సభలో నియమావళిని పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఇవాళ ప్రారంభం కానున్న శాసన సభ ప్రత్యేక సమావేశాల తొలిరోజే... స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కొత్త స్పీకర్‌గా ఆర్జేడీ సీనియర్ నేత అవధ్ బిహారీ చౌదరి పేరును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. 243 మంది సభ్యులున్న  బీహార్ అసెంబ్లీలో.. నితీష్ కుమార్ ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంది.  మెజారిటీ నిరూపించుకోవడానికి ఏదైనా పార్టీ లేదా కూటమికి 121 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది.