ఓల్డ్ సిటీ, వెలుగు: 35వ చిన్నబోయిన దేవేందర్యాదవ్ మెమోరియల్రన్ను ఆదివారం నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. 2.5 కె రన్బాలుర విభాగంలో ఇ.వెంకటేష్, సీహెచ్.సిద్ధు, ఇ.రవితేజ గౌడ్, బాలికల విభాగంలో ఎ.లౌక్య, భూర్వీ, దిశా జోషి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ఎల్బీ.లక్ష్మీకాంత్ రాథోడ్, మాజీ మంత్రి చిన్నబోయిన కృష్ణ యాదవ్, అథ్లెటిక్ కోచింగ్అకాడమీ సెక్రటరీ రాజేశ్కుమార్తదితరులు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.
