
ప్రభుత్వాస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఉదయాన్నే ఆర్ అండ్ బి హౌస్ నుంచి ఎవరికీ తెలియకుండా సైకిల్ పై వెళ్లి ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు కలెక్టర్ . అక్కడున్న పేషేంట్లతో మాట్లాడారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్నింగ్ డ్యూటీకి రావాల్సిన డాక్టర్లు ఎవరైతే ఆప్సెంట్ అయ్యారో వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లా కలెక్టర్ గా ఉన్న నారాయణ రెడ్డి ట్రాన్స్ ఫర్ అయి ఇటీవలే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.