గల్ఫ్ బాధితుల కోసం పోలీస్ కంట్రోల్ రూమ్

గల్ఫ్ బాధితుల కోసం పోలీస్ కంట్రోల్ రూమ్

నిజామాబాద్, వెలుగు: గల్ఫ్​ దేశాల్లో చిక్కుకున్న జిల్లా బాధితుల సహాయార్థం పోలీస్​ కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. సోమవారం మీడియాకు ప్రకటన రిలీజ్​ చేశారు. గల్ఫ్​ దేశాలకు వెళ్లిన వ్యక్తుల క్షేమ సమాచారాన్ని జిల్లాలోని వారి కుటుంబీకులు తమ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

తెలంగాణ గవర్నమెంట్​ఢిల్లీలో ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూమ్​ను సమన్వయం చేసుకొని తమ ఆఫీస్​ పనిచేస్తుందన్నారు. ఇందుకోసం 8712659700, 8712659821 నంబర్లను సంప్రదించాలని సూచించారు.