
నిజామాబాద్: జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రొఫెసర్‌గా కొనసాగుతానని ఆయన ప్రకటించారు. ఆసుపత్రిలో జరుగుతున్న వరుస సంఘటనల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులకు తన రాజీనామా పత్రాన్ని పంపించినట్లు నాగేశ్వరరావు వెల్లడించారు.