ఆర్మూర్ లో రైతుల మహా ధర్నా

ఆర్మూర్ లో రైతుల మహా ధర్నా

nizamabad Farmers protest and High Tension in Nizamabadనిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతులు మహా ధర్నా చేపటారు. పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో 3 వేల మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పసుపు మద్దతు ధర 15 వేలు, ఎర్రజొన్నకు 3500 రుపాయలు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. తమ ఆందోళనను పోలీసులు అడ్డుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో నిన్న అర్ధరాత్రి నుండి 144 సెక్షన్ కొనసాగుతోంది. గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా.. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్మూర్ పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

పసుపు, ఎర్రజొన్న రైతులు తల పెట్టిన మహాధర్నా నేపథ్యంలో రైతు సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆర్మూర్, బాల్కొండ రైతులను తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.