- సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్ అర్బన్, వెలుగు : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మంగళవారం సీఎం ఆఫీస్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని12 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని, అమృత్ పథకం కింద కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్‌పైప్ లైన్ పనులను పూర్తి చేయాలని కోరారు.
నగరంలో నిర్మిస్తున్న కళాభవన్ పనులకు రూ.68 కోట్లు విడుదల చేయాలన్నారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతను తీర్చి మౌలిక వసతులు మెరుగుపరచాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.
