కేసీఆర్ కుటుంబం లిక్కర్, ఫీనిక్స్ స్కామ్​లు చేస్తోంది:ఎంపీ ధర్మపురి అర్వింద్

కేసీఆర్ కుటుంబం లిక్కర్, ఫీనిక్స్ స్కామ్​లు చేస్తోంది:ఎంపీ ధర్మపురి అర్వింద్


న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులు చేస్తుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం లిక్కర్, ఫీనిక్స్ స్కామ్​లు చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. లిక్కర్ దందా చేయడానికి వేల కోట్లు ఖర్చు చేస్తూ.. పేదలకు ఇచ్చేందుకు డబ్బులు లేవనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోడీ 24 దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపితే, కేసీఆర్ రూ.24 వేల కోట్ల అవినీతి సొమ్మును విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రోకు 2013లో హామీ ఇచ్చిన కేసీఆర్, ఎనిమిదిన్నర ఏండ్ల తర్వాత శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. ఆవాస్ యోజన కింద కేంద్రం 3.70 కోట్ల ఇళ్లకు తన వాటాగా రూ.1.68 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. అయినా.. కేసీఆర్ సర్కార్ కనీసం లబ్ధిదారుల జాబితాను కూడా కేంద్రానికి ఇవ్వలేదన్నారు.

ఏపీని తమిళనాడులో కలుపుకోండి

తమిళనాడు మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, అందువల్ల మళ్లీ ఏపీని తమిళనాడులోనే కలుపుకోవాలని సజ్జల కామెంట్స్ కు అర్వింద్​ రిప్లే ఇచ్చారు. రామకృష్ణారెడ్డి తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఎంపీ ప్రశ్నించారు. ఇలాంటి సలహాదారుడిని ఏపీ సీఎం జగన్ మార్చుకోవాలని అడ్వైజ్​ఇచ్చారు.