
ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ని తరమి కొడతామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ హెచ్చరించారు. ఏడోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా నిజామాబాద్ లో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టిసిలొ న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మే చేస్తామని నెల రోజుల ముందే నోటిసులిచ్చినా కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమై, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సమ్మే చేస్తున్న కార్మికులను తొలగించటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తుగ్లక్ పాలనకు ఇది నిదర్శనమని సూచించారు. 50 వేల కుటుంబాల్ని రోడ్డున పడేసి చోద్యం చూస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా సమ్మె విషయం అమీత్ షా దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు అరవింద్.