
- రూ. 18 వేలు తీసుకుంటూ దొరికిన నిజామాబాద్ జిల్లా గొట్టిముక్కల విలేజ్ సెక్రటరీ
నిజామాబాద్, వెలుగు : ఇంటి నంబర్ అలాట్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ సెక్రటరీని నిజామాబాద్ ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మాక్లూర్ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన ముప్పటి రాజేందర్ అనే రైతు తన ఓపెన్ ప్లాట్‌కు ఇంటినంబర్ కేటాయించాలని విలేజ్ సెక్రటరీ గంగామోహన్‌ను కలిశాడు. నంబర్ అలాట్ చేసేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని సెక్రటరీ డిమాండ్ చేశాడు.
దీంతో రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు రైతు సెక్రటరీ గంగామోహన్‌కు ఫోన్ చేసి రూ. 18 వేలు ఇచ్చేందుకు ఒప్పించాడు. ఈ మేరకు బుధవారం పంచాయతీ ఆఫీస్‌కు వెళ్లి సెక్రటరీకి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సెక్రటరీ గంగామోహన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.