మేనిఫెస్టోలో పాత పింఛన్ అంశం చేర్చాలి

మేనిఫెస్టోలో పాత పింఛన్ అంశం చేర్చాలి
  •     ఎన్ఎంఓపీఎస్​ సెక్రటరీ  జనరల్ స్థిత ప్రజ్ఞ

హైదరాబాద్, వెలుగు :  84 లక్షల సీపీఎస్ ఎంప్లాయీస్, టీచర్ల నూతన పింఛన్ విధానం రద్దు విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్)సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్​ రద్దు చేస్తామని, -పాత పెన్షన్ పునరుద్ధరిస్తామనే అంశాలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని శుక్రవారం ఒక ప్రకటనలో  కోరారు. రాష్ట్రంలో పాత పింఛన్ విధానం అమలు కోసం 2.30 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల స్కీములన్నీ ప్రజలకు చేకూర్చేలా చేసేది ప్రభుత్వ ఉద్యోగులేనని గుర్తుచేశారు. సీపీఎస్ విధానాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నా,  ప్రభుత్వాలు మాత్రం ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాలని  కోరారు. దేశంలో84 లక్షల కుటుంబాలకు సామాజిక భద్రత లేని పీఎఫ్ఆర్డీఏ నుంచి సర్కారు ఉద్యోగులను మినహాయించాలని స్థిత ప్రజ్ఞ కోరారు.