వాట్సాప్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 8న ఏ అకౌంట్ నిలిపివేయం

వాట్సాప్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 8న ఏ అకౌంట్ నిలిపివేయం

తమ నూతన పాలసీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన

మే 15 వరకు గడువు పెంచిన వాట్సాప్

తమ కంపెనీ నిబంధనలను ఫిబ్రవరి 8లోగా అంగీకరించకపోతే యూజర్ల అకౌంట్ డిలీట్ చేస్తామని చెప్పిన వాట్సాప్.. తన నిర్ణయాన్ని మార్చుకుంది. వాట్సాప్ తమ నూతన ప్రైవసీ పాలసీ విధానాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మే 15 వరకు తమ పాలసీ విధానాన్ని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ తమ అఫిషీయల్ ట్వీట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఫిబ్రవరి 8లోపు తమ నూతన పాలసీను అంగీకరించకపోతే అకౌంట్ డిలీట్ చేస్తామని వాట్సాప్ 2 బిలియన్ల యూజర్లను హెచ్చరించింది. దాంతో యూజర్ల నుంచి వాట్సాప్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమ వ్యక్తిగత డేటా లీక్ అవుతుందేమోనని యూజర్లు ఆందోళన చెందారు. వాట్సాప్ పాలసీ నచ్చని వాళ్లు.. వేరే ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు చూస్తుండటంతో నూతన పాలసీని వాయిదా వేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

‘జనవరి 5న కంపెనీ కొత్త విధానాన్ని ప్రకటించినప్పటి నుంచి.. యూజర్ల నుంచి అసహనం వ్యక్తం అయింది. యూజర్ల డేటా, లోకేషన్, పైవసీ మొదలైనవి లీక్ అవుతాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. దాంతో యూజర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. నూతన పాలసీ విధానాన్ని వాయిదా వేస్తున్నాం. ఫిబ్రవరి 8న ఏ యూజర్ యొక్క అకౌంట్ డిలీట్ కాదు మరియు తాత్కాలికంగా నిలిపివేయబడదు. యూజర్లు ఎదర్కొంటున్న గందరగోళాన్ని తగ్గించడానికి మేం తీవ్ర కృషి చేస్తున్నాం. మే వరకు మా వ్యాపార ప్రణాళికలను వెనక్కి తీసుకుంటున్నాం. నిబంధనలను సమీక్షించడానికి మరియు అర్థం చేసుకోవడానికి వినియోగదారులకు ఇంకా ఎక్కువ సమయం ఉంది. నూతన పాలసీ ఆధారంగా యూజర్ల ఖాతాలను తొలగించాలని ఎప్పుడూ ప్లాన్ చేయలేదు మరియు భవిష్యత్తులో కూడా అలా చేయబోం’ అని వాట్సాప్ ట్వీట్ చేసింది.

For More News..

అమెరికన్లకు భారీ కరోనా ప్యాకేజీ

విషాదంగా మారిన పాత దోస్తుల గోవా ట్రిప్‌

కేసీఆర్ సారు ఎప్పుడొస్తరో.. ఇండ్లు ఎప్పుడిస్తరో!