మెట్రో సర్వీసులు యధాతథం

మెట్రో సర్వీసులు యధాతథం

ఇవాళ, రేపు మెట్రో రైళ్లు నడిచే వేళల్లో ఎలాంటి మార్పూ లేదని హైదరాబాద్​ మెట్రో రైల్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ఎన్​.వి.ఎస్​.రెడ్డి వెల్లడించారు. మునుపటిలాగే నిరంతరాయంగా మెట్రో రైళ్ల సర్వీసులు నడుస్తాయని, వాటిని ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రైళ్లు నడిచే వేళలు, స్టాప్​ లలో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పారు. హైదరాబాద్​ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు స్పష్టతను ఇచ్చేందుకు ఈమేరకు ప్రకటనను విడుదల చేశారు.