జనగామ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం

జనగామ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం

రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లపై తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమునపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 19మంది కౌన్సిలర్లు దానిపై సంతకం చేసి కలెక్టర్కు అందజేశారు. తిరుగుబాటు చేసిన కౌన్సిలర్లలో 11 మంది బీఆర్ఎస్ కు చెందిన వారు కాగా.. 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. జనగామ మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్కు 18 మంది, కాంగ్రెస్కు 8, బీజేపీకి నలుగుర కౌన్సిలర్లు ఉన్నారు. ఇష్యూ కేటీఆర్ వరకు వెళ్లడంతో కౌన్సిలర్లను బుజ్జగించేందుకు ఎమ్మెల్యే, అతని అనుచరులు రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఫలించకపోవడంతో అవిశ్వాసం తీర్మానం కలెక్టర్ ఆఫీస్ కు చేరింది.