రాష్ట్రంలో కరోనా వైరస్ లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను ఈటల ప్రారంభించారు. గాంధీ మెడికల్ కాలేజీ లైబ్రరీ బిల్డింగ్‌ను ప్రారంభించిన ఆయన.. ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. కరోనా విషయంలో వైద్యశాఖ అలర్ట్ గా ఉందన్నారు. కరోనాను అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక్కడే మెడికల్ టెస్టులు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. చైనా నుంచి వచ్చిన వ్యక్తులను 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని మంత్రి ఈటల తెలిపారు. ఇప్పటికే ఛాతీ, ఫీవర్ ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులను ప్రారంభించామన్నారు.
