మహిపాల్ రెడ్డి ఇంట్ల ఎలాంటి అవినీతి ఆస్తి దొరకలేదు : హరీష్ రావు

మహిపాల్ రెడ్డి ఇంట్ల ఎలాంటి అవినీతి ఆస్తి దొరకలేదు : హరీష్ రావు

ఎమ్మెల్యే, మహిపాల్ రెడ్డి నివాసంలో  ఎలాంటి అక్రమ డబ్బు దొరకలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒక్క తప్పు కూడా లేదు.. అయినా ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని అన్నారు.  నీట్ ప్రశ్నపత్రం లీకైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

బీహార్, గుజరాత్‌లలో పరీక్షకు  రెండురోజుల ముందు పేపర్ లేకైందని.పత్రాలను అంగట్లో సరుకులా లక్షలకు అమ్ముకుంటుంటే ఈడీ, ఐటీ  ఎందుకు దాడులు చేయడం లేదని ఫైర్ అయ్యారు. మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించారని బీరువాల తాళాలు, పేపర్లు ఇచ్చారని వారు ఏలాంటి తప్పు చేయలేదని చెప్పారు. 

ఈడికి ఏలాంటి ఆస్తులు దొరకలేదని తెలిపారు. ఇంట్లో ఉన్న పసిపిల్లలు కూడా ఏడ్చేలా ఈడీ అధికారులు వేధించారని న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ధర్మమే గెలుస్తుందని చెప్పారు హరీష్ రావు.