ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు: సోమనాథ్ భారతి

 ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు: సోమనాథ్ భారతి

ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని.. సీబీఐ, ఈడీ సెర్చ్ చేసినా ఒక్క ఆధారం కూడా దొరకలేదని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి అన్నారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మనీష్ సిసోడియాపై కావాలని కక్షగట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయనను అరెస్టు చేస్తే అది రాజకీయ కక్ష సాధింపే అవుతుందని సోమ్ నాథ్ భారతి స్పష్టం చేశారు. 

గుజరాత్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాబోతోందని, గుజరాత్ లో ప్రతి పౌరుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ర్యాలీలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని సోమనాథ్ భారతి విమర్శించారు.