ఎంజాయ్ పేరుతో డ్రగ్స్ వద్దు .. డ్రగ్స్ పై నిరంతర పోరాటం చేయాలి ..ప్రొఫెసర్ కోదండరామ్

ఎంజాయ్ పేరుతో డ్రగ్స్ వద్దు .. డ్రగ్స్ పై నిరంతర పోరాటం చేయాలి ..ప్రొఫెసర్ కోదండరామ్

బషీర్​బాగ్, వెలుగు: గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు నిరంతర పోరాటం చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు, తెలంగాణ భాష, సంస్కృతిక, సామాజిక, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సలహా కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. గ్రామాల్లో డ్రగ్స్ వ్యసనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

 తెలంగాణ సాంస్కృతిక శాఖ, ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీలో ‘ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బస్సు కళా జాతా పేరుతో రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.

 అంతకుముందు కాలేజీ ఆడిటోరియంలో  ‘మనిషి విలువలు, డ్రగ్స్ బారిన పడుతున్న విద్యార్థులు’ అనే అంశంపై నిర్వహించిన వీధి నాటకం, గేయాలు ఆకట్టుకున్నాయి. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.వి. రాజశేఖర్, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రేణుక, కో-ఆర్డినేటర్లు మంజుల, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.