థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపదు

థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపదు

కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపబోదన్నారు నీతీ అయోగ్‌ మెంబర్‌ వీకే పాల్‌. ఏ వేవ్‌ కూడా ప్రత్యేకంగా పిల్లలపై ఎఫెక్ట్ చూపుతుందనడానికి సరైన ఆధారల్లేవని స్పష్టం చేశారు. కరోనా కేసులు చిన్న పిల్లల్లో పెరుగుతుండంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారని తెలిపారు పాల్. అయితే పిల్లలపై కరోనా వేవ్‌ ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాల్లేవన్నారు. పెద్ద వాళ్లలాగే పిల్లలు కూడా కరోనా బారిన పడే ఛాన్స్‌ ఉందన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా పిల్లలపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని ఆయన చెప్పారు. 

అంతేకాదు ..పేరెంట్స్‌ టీకా వేసుకోవడం కారణంగా పిల్లల్లో వైరస్‌ వ్యాప్తిని కొంత వరకు అడ్డుకోవచ్చని చెప్పారు వీకే పాల్‌.