టెట్​ క్వాలిఫై అయినోళ్లకు డీఎస్సీకి నో ఫీజు

టెట్​ క్వాలిఫై అయినోళ్లకు డీఎస్సీకి నో ఫీజు
  • వెబ్ సైట్​లో విద్యాశాఖ మార్పులు 

హైదరాబాద్, వెలుగు: టెట్–2024 క్వాలిఫై అయిన వారు ఒకసారి ఉచితంగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకొనేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. టెట్ ఫలితాలు రిలీజ్ చేసిన రోజే సీఎం రేవంత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అందుకు అనుగుణంగా డీఎస్సీ దరఖాస్తు వెబ్ సైట్​లో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు శనివారం మార్పులు చేశారు. 

రిజిస్ట్రేషన్ ఫామ్​లో టెట్-–2024 క్వాలిఫై అయిన వారి కోసం అర్హత సాధించారా? లేదా? అనే కాలమ్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టెట్ హాల్ టికెట్ నంబర్, జర్నల్ నంబర్, ఎగ్జామ్ పేపర్ కాలమ్స్ ఫిల్ చేసి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది.