జీహెచ్ఎంసీ ఎన్నికలు వద్దు.. సిటీలో పోస్టర్ కలకలం

జీహెచ్ఎంసీ ఎన్నికలు వద్దు.. సిటీలో పోస్టర్ కలకలం

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలని సిటీలో పోస్టర్లు వెలుస్తున్నాయి. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని, ప్రపంచవ్యాప్తంగా రెండో దశ విజృంభిస్తుందని, ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదంటూ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.  మలక్ పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్ డివిజన్ పరిధిలో ఈ పోస్టర్ ప్రత్యక్షం కాగా, ఇందులో ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛయుతంగా జరగాల్సిన ఎన్నికలు ఈ విపత్కర పరిస్థితుల్లో సాధ్యం కాదని అందులో పేర్కొని ఉంది. అదేవిధంగా ఐసీఎంఆర్ సర్వే ప్రకారం 60 మిలియన్ మంది దేశవ్యాప్తంగా కరోనా బారినపడ్డారని, జన సమూహం కారణంగా.. చలికాలంలో కేసులు పెరిగే అవకాశం ఉందని, వచ్చే వేసవి వరకు కరోనా తీవ్రత తగ్గితేనే ఎన్నికలు జరపాలని పోస్టర్ లో రాసి ఉంది.