ఇద్దరు కంటె ఎక్కువ పిల్లలుంటే నో సర్కారీ జాబ్: సుప్రీంకోర్టు

ఇద్దరు కంటె ఎక్కువ పిల్లలుంటే నో సర్కారీ జాబ్: సుప్రీంకోర్టు

రాజస్థాన్‌ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల అర్హతపై 13 ఏళ్ల క్రితం పెట్టిన నిబంధనను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. 2001లో రాజస్థాన్‌ సర్కార్‌.. ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కావాలంటే.. ఇద్దరికంటే ఎక్కువగా సంతానం ఉండకూడదనే రూల్‌ను తీసుకొచ్చింది. అయితే 2017లో పదవీ విరమణ చేసి.. 2018లో రాజస్థాన్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ కోసం అప్లై చేసుకున్న మాజీ సైనికుడు రామ్‌ లాల్ ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. చివరికి రాజస్థాన్ అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించింది. 

రాజస్థాన్‌ రూల్‌ను సమర్థించిన సుప్రీం

2001లో రాజస్థాన్‌ సర్కార్ పెట్టిన రూల్స్‌ ప్రకారం.. పిటిషనర్‌ రామ్‌లాల్ 2018లో అప్లై చేసిన పోలీసు ఉద్యోగానికి అనర్హులయ్యారు. దీంతో 2022లో రాజస్థాన్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అక్కడ అతనికి ఊరట లభించలేదు. ఇక చివరికి అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2002 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తూ తీసుకొచ్చిన నిబంధనలు ప్రకారం ఈయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడయ్యాడు. రామ్‌లాల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.

మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన 

ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కావడానికి.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధనను పాటిస్తున్న రాష్ట్రాల్లో.. రాజస్థాన్‌తో సహా.. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, కర్నాటక కూడా ఉన్నాయి. అయితే 2021లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా జనాభా నియంత్రణ బిల్లును తీసుకొచ్చింది. 

ALSO READ :- ట్రైబల్ పిల్లలకు పాల పంపిణీలో స్కామ్.. మాజీ సీడీపీఓ అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్

ఇతర నిబంధనలతో సహా.. ఇద్దరు పిల్లల విధానాన్ని ఉల్లంఘించిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయకుండా.. అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని సిఫార్సులు చేసింది.