ట్రైబల్ పిల్లలకు పాల పంపిణీలో స్కామ్.. మాజీ సీడీపీఓ అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్

ట్రైబల్ పిల్లలకు పాల పంపిణీలో స్కామ్.. మాజీ సీడీపీఓ అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్

ట్రైబల్ పిల్లలకు పాలు పంపిణీ చేసే ఆరోగ్యలక్ష్మీ మిల్క్ పథకంలో స్కామ్ జరిగినట్లు గుర్తించింది ఏసీబీ. ఈ పథకంలో  నిధులను పక్కదారి పట్టించిన మాజీ  సిడిపిఒ, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ అనిశెట్టి శ్రీదేవిని ఫిబ్రవరి 29వ తేదీ గురువారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

గతంలో అదిలాబాద్ జిల్లా జైనూర్ లో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓగా అనిశెట్టి శ్రీదేవి పనిచేస్తున్న టైమ్ లో నిధులు గోల్ మాల్ చేసినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఆరోగ్యలక్ష్మీ మిల్క్ స్కీమ్ లో 65 లక్షల 78వేల రూపాయల అవకతవకలు జరిగినట్లు ఏసీబీ తెలిపింది. 322 అంగన్ వాడీ సెంటర్లకు పాలు పంపినట్లు రికార్డుల్లో శ్రీదేవి పేర్కొన్నారని.. 2015-2016 లో ఈ స్కామ్ జరిగిందని అధికారులు చెప్పారు. శ్రీదేవిని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరపర్చారు ఏసీబీ అధికారులు.