గంగా జలంపై ఎలాంటి జీఎస్టీ లేదు : సీబీఐసీ

గంగా జలంపై ఎలాంటి జీఎస్టీ లేదు : సీబీఐసీ

న్యూఢిల్లీ : గంగా జలంపై ఎలాంటి జీఎస్టీ విధించలేదని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది. పవిత్ర గంగా నది నీటిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీని విధించిందని గురువారం కాంగ్రెస్‌‌ ఆరోపించింది. "మోదీ జీ.. మీరు ఉత్తరాఖండ్‌‌ పర్యటనలో ఉన్నారు. కానీ, మీ ప్రభుత్వం పవిత్ర గంగా జలంపైనే 18 శాతం జీఎస్టీ విధించింది. తమ ఇండ్లల్లో ఎంతో పవిత్రంగా ఉంచుకునే గంగాజలంపై జీఎస్టీ విధించడం ఎంతవరకు సమంజసం " అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. అయితే, కాంగ్రెస్ వాదనను సీబీఐసీ తోసిపుచ్చింది.

గంగాజలానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని సీబీఐసీ పేర్కొంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదని తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ 14, 15 సమావేశాల్లో పూజ సామగ్రిపై జీఎస్టీ అంశం చర్చకు వచ్చిందని, వాటిని మినహాయింపు జాబితాలోనే ఉంచాలని నిర్ణయించినట్లు సీబీఐసీ పేర్కొంది.