ఢిల్లీలో బీజేపీ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ

ఢిల్లీలో బీజేపీ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ

ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో కేంద్రం చేపట్టిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో హెల్మెట్ ధరించనందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి 20 వేల జరిమానా విధించారు. దీనిపై స్పందించిన ఎంపీ హెల్మెంట్ ధరించనందుకు ట్విట్టర్ లో క్షమాపణలు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన ఫైన్ ను  చెల్లిస్తానని చెప్పారు. అంతేకాదు పీయూసీ సర్టిఫికెట్ కోసం వాహన యజమానిని విచారించినట్లు పోలీసులు తెలిపారు.  

దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హర్‌ ఘర్‌ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎర్రకోట నుంచి బీజేపీ నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, పీయూష్‌ గోయల్‌ జెండా ఊపి ప్రారంభించారు.

మన దేశానికి స్వాతంత్య్ర వచ్చి ఆగస్టు 15వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.