ఇబ్బందుల్లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు : మంత్రుల గంగుల

 ఇబ్బందుల్లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు  : మంత్రుల గంగుల

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి.. వరి ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 6972 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొంటున్నామని వివరించారు. 

ఇప్పటివరకూ దాదాపు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని..90 వేల మంది రైతుల నుంచి సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇందుకోసం రూ.10,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గతేడాది కంటే ధాన్యానికి అధికంగా డిమాండ్ ఉండడంతో రైతులకు ప్రైవేట్ వ్యాపారులు కూడా ఎంఎస్పీ  చెల్లించి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.