ఎస్సారెస్సీకి కాళేశ్వరం జలాల తరలింపు బ్రేక్

ఎస్సారెస్సీకి కాళేశ్వరం జలాల తరలింపు బ్రేక్

కమ్మర్‌‌‌‌పల్లి, వెలుగు: శ్రీరామ్‌‌‌‌సాగర్‌‌‌‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) కు కొద్దిగా వరద రావడంతో కాళేశ్వరం నుంచి తరలించే జలాలకు బ్రేక్ పడింది. కొద్ది రోజుల క్రితమే నిజామాబాద్‌‌‌‌ జిల్లా కమ్మర్‌‌‌‌పల్లి మండలం నాగపూర్‌‌‌‌ గ్రామం ముప్కాల్ జీరో పాయింట్ వద్ద వరదకాలువలోకి జలాలు వచ్చి చేరినా అక్కడి నుంచి ఎస్సారెస్పీకి వదలడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి.

చుట్టూప్రక్కల నుంచి ప్రాజెక్టుకు కొంత ఇన్‌‌‌‌ఫ్లో వస్తుండడంతో కాళేశ్వరం జలాలను విడుదల చేయవద్దని ఉన్నత స్థాయి ఆఫీసర్లు సిబ్బందికి సూచించినట్లు సమాచారం. ఎస్సారెస్పీ కెపాసిటీ 91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. మరో 54 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. రాజేశ్వర్‌‌‌‌రావుపేట్ పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ నుంచి నీటిని విడుదల చేస్తే 18 టీఎంసీల నుంచి 19 టీఎంసీల వరకు ఎస్సారెస్పీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్‌‌‌‌ప్లో పేరుతో ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం నీటిని ఆపడం సరికాదని రైతులు అంటున్నారు.