జూపల్లికి అపాయింట్‌మెంట్ ఇవ్వని కేటీఆర్

జూపల్లికి అపాయింట్‌మెంట్ ఇవ్వని కేటీఆర్

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పాలమూరు రాజకీయం వాడీవేడీగా సాగుతోంది. అక్కడి రాజకీయం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్షయించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా.. పలువురు రెబల్స్‌గా పోటీచేశారు. వారంతా మాజీ ఎమ్మెల్యే జూపల్లికి చెందినవారని సమాచారం. పాలమూరులో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిన్నటి ఫలితాలో జూపల్లికి చెందిన వర్గం నుంచి 8 మంది గెలుపొందారు. మరో 8 స్థానాల్లో అధికార టీఆర్ఎస్ దక్కించుకుంది. ఒక స్థానం మాత్రం కాంగ్రెస్ వశమయింది. అయిజ, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి మంత్రి కేటీఆర్‌తో చర్చించేందుకు జూపల్లి ప్రయత్నించారు. అందుకు టీఆర్ఎస్ హైకమాండ్ అంగీకరించలేదు. కనీసం జూపల్లికి మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదు. దాంతో జూపల్లి.. మంత్రి కేటీఆర్‌ను కలవకుండానే వెళ్లిపోయారు. కొల్లాపూర్‌లో జూపల్లి వర్గీయులను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు కేటీఆర్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఎక్స్ అఫీషియో ఓట్లతో అయిజ, కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ అధిష్టానం రెబల్స్‌పై, వారికి మద్ధతిచ్చిన నాయకులపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

For More News..

యువతకు పార్ట్ టైం జాబ్‌గా ర్యాపిడ్ రైడ్

‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అంటున్న యాంకర్ ప్రదీప్

యాభైవేల చెట్లు పెంచిన ఒకే ఒక్కడు.. పద్మశ్రీతో సత్కారం