ఇక పైరసీ జోలికెళ్లను.. బయటికి వెళ్లిన తర్వాత పైరసీ గురించి ఆలోచించను.. అని పైరసీ విషయంలో ఐబొమ్మ రవి పోలీసుల ఎదుట పశ్చాతాపం వ్యక్తం చేశాడు. పోలీస్ కస్టడీలో ఉన్న ఇమ్మడి రవి రెండు రోజుల విచారణలో నోరు విప్పలేదు. మూడు రోజుల కస్టడీలో చివరి రోజు విచారణ కావడంతో రవి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే పైరసీ గురించి పూర్తి వివరాలు చెప్పని రవి.. ఇకపై పైరసీ చేయనని చెప్పినట్లు తెలిపారు.
ఐబొమ్మ రవి మూడు రోజుల కస్టడీ ఇవాళ్టితో (నవంబర్ 29) ముగియనుండడంతో నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీ కేసులో సాంకేతిక వివరాలతో పాటు దేశ విదేశాల్లో ఏజెంట్లు ఉద్యోగుల వివరాలను గురించి ఆరా తీశారు. అయితే మూడో రోజు కూడా పైరసీ గురించి నోరువిప్పలేదని చెబుతున్నారు.
పైరసీ కేసులో సాంకేతిక వివరాలతో పాటు దేశ విదేశాల్లో ఏజెంట్లు, ఉద్యోగుల వివరాల గురించి ఆరా తీశారు పోలీసులు. పైరసీ గుట్టు బయటపడినా విదేశీ పౌరసత్వం ఉండడంతో తప్పించుకోవచ్చు అన్న ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆరేళ్లుగా తనను పోలీసులు పట్టుకోకపోవడంతో తన నెట్వర్క్ ను విస్తరించినట్లు పోలీసులకు చెప్పాడు రవి.
కస్టడీలో భాగంగా 2025 నవంబర్ 27న చంచల్ గూడ జైలు నుంచి రవిని సీసీఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. మొదటిరోజు విచారణలో ఎన్జిలా నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్ సంపాదించారు. కొన్ని ముఠాలు ఐపి మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఐపి మాస్క్ పై రవిని అరా తీశారు సైబర్ క్రైమ్ పోలీసులు. పోర్న్ వెబ్ సైట్స్, పైరసీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్స్ క్లోస్ చెయ్యాలని చూస్తున్న పోలీసులు.. యాడ్ బుల్ యాప్ నిర్వహించడానికి గలా కారణాలపై కీలక లీడ్ సంపాదించారు. గేమింగ్,బెట్టింగ్ యాప్ ద్వారా రవి కోట్లు గడించినట్లు గుర్తించారు.
ఇక రెండో రోజు రెండో రోజు ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు విషయాలపై రవిని ప్రశ్నించారు. రెండోరోజు విచారణలో ఏ మాత్రం రవి సహకరించలేదు. పోలీసుల ప్రశ్నలకు రవి సమాధానం చెప్పలేదు. చివరిరోజు 3వ రోజు కావడంతో ఇవాళ (నవంబర్ 29) పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయనున్నారు. అదే విధంగా ఇవాళ్టితో కస్టడీ ముగుస్తుండటంతో నాంపల్లి కోర్టులో రవిని హాజరుపర్చనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
