టీశాట్​ నెట్ వర్క్​ చానెల్స్​లో ప్రసారాలకు ఎటువంటి ఇబ్బంది లేదు : సీఈఓ వేణుగోపాల్​రెడ్డి

టీశాట్​ నెట్ వర్క్​ చానెల్స్​లో ప్రసారాలకు ఎటువంటి ఇబ్బంది లేదు : సీఈఓ వేణుగోపాల్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: టీశాట్​ నెట్ వర్క్​ చానెల్స్​లో ప్రసారాలకు ఎటువం టి ఇబ్బంది లేదని టీశాట్​ సీఈవో బోద నపల్లి వేణుగోపాల్​ రెడ్డి తెలిపారు. టీశాట్  చానెళ్లు ఆగిపోయాయన్న కేటీఆర్  ట్వీట్​కు మంగళవారం ఆయన కౌంటర్​ ఇచ్చారు. జీశాట్ 8 సిగ్నల్స్​లో టీ శాట్​ విద్య, నిపుణ చానెల్స్​  ప్రసారాలు యధావిధిగా కొనసాగుతున్నాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జీశాట్​ 16 టెస్ట్​ సిగ్నల్​ మాత్రమేనని, టీశాట్​ ప్రసారాలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పేమెంట్ల కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని, రాష్ట్రంలోని గత ప్రభుత్వ నిర్వాకం వల్లే జీశాట్​ 16 ఇంకా అప్​గ్రేడ్​ కాలేదని వెల్లడించారు. కాగా, నిరుపేద విద్యార్థులు, నిరుద్యో గులకు ఉచితంగా కోచింగ్​ ఇస్తున్న టీశాట్​ చానెళ్లు.. సర్కారు నిర్లక్ష్యం వల్ల మూగబోయాయని కేటీఆర్​ అంతకుముందు ట్వీట్  చేశారు. 
ఈ వ్యాఖ్యలను టీశాట్​ సీఈవో వేణుగోపాల్​రెడ్డి ఖండించారు.