కొవిడ్ 19 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి హరీశ్ రావు

కొవిడ్ 19 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి హరీశ్ రావు

కొవిడ్ 19 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కానీ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారికి వెంటనే బూస్టర్ డోస్ వేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

చైనాలో కరోనా కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌వో) చీఫ్‌‌ టెడ్రోస్‌‌ అధనోమ్‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌‌లో వేగం పెంచాలని, వైరస్‌‌ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న వారికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు. వ్యాధి తీవ్రత, హాస్పిటళ్లలో చేరే వారి సంఖ్య, ఐసీయూ అవసరాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని చైనాను కోరారు. ‘‘చైనాలో వైరస్‌‌ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌‌వో ఆందోళన చెందుతోంది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని నివేదికలు వస్తున్నాయి. క్లినికల్‌‌ కేర్‌‌‌‌, ఆరోగ్య వ్యవస్థ భద్రతకు డబ్ల్యూహెచ్‌‌వో నుంచి మద్దతు ఉంటుంది”అని ఆయన చెప్పారు.