పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ మూవీ చేస్తున్నాడు. వరుస షెడ్యూల్‌లో పాల్గొంటున్న ప్రభాస్ అతి త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే, ఈ మూవీ షూటింగ్లో ప్రభాస్ గాయపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఓ కీలక యాక్షన్ సీన్ కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ కింద పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రభాస్ చేతికి చిన్నపాటి గాయం అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గాయం తీవ్రమైనది కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు గాయం అవ్వడం గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు.
ఇప్పటివరకు ఫౌజీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రభాస్ ఆరోగ్యం బాగానే ఉందని, షూటింగ్‌కు పెద్దగా అంతరాయం కలగలేదని సమాచారం. అభిమానులు మాత్రం తమ హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారని టాక్. గాయం పెద్దది కాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇకపోతే, ‘ఫౌజీ’తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నారని సమాచారం. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్, ఈ సినిమాల షెడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే మళ్లీ సెట్స్‌పై సందడి చేయనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
సైనికుడి పాత్రలో..
సీతారామం వటి క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు హను రాఘవపూడి.. భారీ బడ్జెట్ తో ఈ 'ఫౌజీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం 1940 కాలం నాటి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్యీ ఇస్మాయిల్ నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమఖేర్, జయప్రద కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనించనున్నట్లు సమాచారం. మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్.
पद्मव्यूह विजयी पार्थः
— Hanu Raghavapudi (@hanurpudi) October 23, 2025
पाण्डवपक्षे संस्थित कर्णः।
गुरुविरहितः एकलव्यः
जन्मनैव च योद्धा एषः॥
Happy Birthday to our dearest #Prabhas garu ❤️🔥
Taking pride in presenting you as #FAUZI, this journey so far has been unforgettable and only promises to get bigger from here!
FAUZI -… pic.twitter.com/uLHVBEH7ib
