FACT CHECK: వ్యాక్సిన్ తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా?

FACT CHECK: వ్యాక్సిన్ తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా?

న్యూఢిల్లీ: కరోనాతో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో వైరస్ మీద ఎన్నో అసత్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. కొవిడ్ పై పోరులో కీలకంగా భావిస్తున్న వ్యాక్సిన్ మీద కూడా ఫేక్ న్యూస్ వ్యాప్తి అవుతోంది. టీకా తీసుకుంటే రెండేళ్లలో మృతి చెందుతారని ఫ్రెంచ్ వైరాలజిస్ట్, నోబెల్ గ్రహీత ల్యూక్ మోంటగ్ నైర్ అన్నట్లు చెప్పిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహమ్మారి చెలరేగుతున్న టైమ్ లో వ్యాక్సినేషన్ సరికాదని, యాంటీ బాడీస్ వల్ల ఇన్ఫెక్షన్ మరింతగా బలపడుతుందని ఓ ఇంటర్వ్యూలో మోంటర్ నైగ్ చెప్పినట్లు ఉన్న ఫొటో నెట్ లో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫొటో ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తెలిపింది. టీకా పూర్తిగా సురక్షితమైందని పీఐబీ స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేయొద్దని హెచ్చరించింది.