బండి సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు 

బండి సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు 

రేపటి నుంచి  భైంసాలో మొదలుకానున్న తెలంగాణ బీజేపీ చీఫ్​ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు జిల్లా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భైంసా సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు.. బహిరంగసభకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. అయితే పాదయాత్ర కోసం బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ నుంచి భైంసాకు బయలుదేరారు. రేపు జరిగే సభ కోసం ఇప్పటికే బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి నిమిషంలో పర్మిషన్ లేదని చెప్పడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, భైంసా నుండి కరీంనగర్ వరకు 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొనసాగనుంది. డిసెంబర్ 17న  కరీంనగర్ జిల్లాలో ఈ యాత్ర ముగియనుంది. ఐదో విడతలో జరిగే ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభ సభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొననున్నారు.