జనం చేతికి అందకుండానే ‘డబుల్’ ఇండ్లు పెచ్చులూడుతున్నయ్

జనం చేతికి అందకుండానే ‘డబుల్’ ఇండ్లు పెచ్చులూడుతున్నయ్

సర్పంచ్, గ్రామస్థుల ఆందోళన

కామేపల్లి, వెలుగు: ప్రారంభానికి ముందే డబుల్ బెడ్ రూం ఇండ్ల స్లాబ్స్ పెచ్చులూడుతుండడంతో సర్పంచ్, గ్రామస్థులు ఆందోళనకు దిగిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జరిగింది. మండలంలోని రామకృష్ణా పురం పంచాయతీ పరిధి హరిచంద్రపురం గ్రామం గుట్టల సమీపంలో 50 డబుల్బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి ఐటీడీఏ రూ.5.40 లక్షలు కేటాయించింది. ఇండ్ల నిర్మాణాన్ని ఆర్వీఎం ఇంజనీరింగ్ ఆఫీసర్లకు అప్పజెప్పింది. టెండర్ పొందిన కాంట్రాక్టర్ నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు పూర్తి చేశాడు. ఇండ్ల నిర్మాణం పూర్తయినా ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. బిల్డింగ్ స్లాబ్ మీద చేతితో తీస్తుంటే పెచ్చులూడుతోంది. లోపల అర ఇంచు మందం సిమెంట్ లేకుండా పూర్తిగా ఇసుక మాత్రమే తేలడంతో గ్రామస్తులు అక్కడ ఎలా ఉండాలంటూ ప్రశ్నిస్తున్నారు. గురువారం సర్పంచ్ తో పాటు స్థానికులు నాణ్యత లోపాలను నిరసిస్తూ డబుల్బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఆందోళన చేశారు. నాణ్యతా లోపంతో నిర్మించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For More News..

నాలాలపైనే లీడర్ల ఇండ్లు!

సర్కారు స్కూళ్లు షురూ..

కొత్త రూల్స్ తో రిజిస్ట్రేషన్లు ఢమాల్