ఆసియా కప్‎లో ఇండియా–పాక్ మ్యాచ్ జరుగుతుందా.. లేదా..? అజిత్ అగార్కర్ ఏమన్నారంటే..?

ఆసియా కప్‎లో ఇండియా–పాక్ మ్యాచ్ జరుగుతుందా.. లేదా..? అజిత్ అగార్కర్ ఏమన్నారంటే..?

క్రికెట్‎లో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‎కు ఉండే క్రేజ్ వేరే. మరే మ్యాచుకు ఉండని ఆదరణ దాయాదుల పోరుకు ఉంటుంది. టెస్ట్, వన్డే, టీ20  ఫార్మాట్ ఏదైనా సరే.. ఇండియా, పాక్ జట్లు తలపడుతున్నాయంటే ఈ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్సే కాకుండా.. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి పోరే మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ ఆసియా కప్ 2025లో భాగంగా తలపడబోతున్నాయి. 

సమీకరణాలు అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆసియా కప్‎లో భారత్, పాక్ మూడు సార్లు పోటీ పడనున్నాయి. అయితే, ఆసియా కప్‎లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. వాణిజ్య సంబంధాలతో పాటు పాక్‎తో అన్ని బంధాలను తెంచేసుకుంది భారత్. ఈ  కారణంతోనే ఇటీవల జరిగిన వరల్డ్ చాంపియన్స్ లెజెండ్ లీగ్‎లో కూడా పాకిస్తాన్‎తో మ్యాచును భారత్ బైకాట్ చేసింది.

పహల్గాంలో మారణహోమం సృష్టించిన కూడా పాకిస్తాన్‎తో ఆసియా కప్‎లో కూడా భారత్ ఆడొద్దని రోజురోజుకు డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‎తో ఎక్కడ ఎప్పుడు పోటీ పడ్డ భారతే గెలుస్తుందని.. అందులో డౌటే లేదని.. కాకపోతే ఇటీవల ఇరుదేశాల చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆసియా కప్‎లో పాక్‏తో మ్యాచ్ ఆడొద్దని బీసీసీఐకి సూచిస్తున్నారు. 

ఈ తరుణంలో ఇండియా పాక్ మ్యాచ్‎ ఇష్యూ భారత్ చీఫ్​సెలెక్టర్ అజిత్ ఆగార్కర్‎కు చేరింది. 2025, ఆగస్ట్ 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ముంబైలో విలేఖరుల సమావేశంలో భారత స్క్వాడ్‎ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఇండియా పాక్ మ్యాచ్ గురించి అజిత్ ఆగార్కర్‏కు ప్రశ్న ఎదురైంది. ఆసియా కప్‎లో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందా అని ఓ జర్నలిస్ట్ ఆగార్కర్‎ను ప్రశ్నించాడు. 

వెంటనే రియాక్ట్ అయిన ఆగార్కర్.. ఇండియా పాకిస్థాన్ గురించి ఎవరూ ప్రశ్నలు అడగొద్దని చెప్పారు. జర్నలిస్ట్ అడిగిన ఆ ప్రశ్నను తోసిపుచ్చారు ఆగార్కర్. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఇండియా పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అని దానిపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా భారత చీఫ్​ సెలెక్టర్ అజిత్ ఆగార్కర్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.

ఆసియా కప్–2025 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొత్తం 15 మందితో కూడిన జట్టును మంగళవారం (ఆగస్టు 19) అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. సూర్యకుమార్ కెప్టెన్‎గా వ్యవహరించనుండగా.. గిల్ వైస్ కెప్టెన్‎గా ఎంపికయ్యాడు. 2025, సెప్టెంబర్ 9 దుబాయ్, అబుదాబి వేదికగా ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది.