ఇన్స్టాగ్రామ్లో నో సేఫ్టీ !

ఇన్స్టాగ్రామ్లో నో సేఫ్టీ !

ఇన్​స్టాగ్రామ్​ డైరెక్ట్ మెసేజెస్​లో ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్​క్రిప్షన్ ఫీచర్​ను తొలగిస్తున్నట్టు మెటా ప్రకటించింది. ఈ ఫీచర్ మే 8 తర్వాత నుంచి అందుబాటులో ఉండదు. చాలా తక్కువమంది యూజర్లు మాత్రమే దీన్ని వాడుతున్నట్టు తెలిసింది. అందుకే ఈ ఫీచర్​ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెటా సపోర్ట్ పేజీ అప్​డేట్ ఇచ్చింది. యాప్​లో ప్రైవేట్ చాట్స్​ ప్రాసెస్​లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎండ్ టు ఎండ్ ఎన్​క్రిప్షన్​ ద్వారా సెండ్ చేసినవాళ్లు, రిసీవ్​ చేసుకున్నవాళ్లు మాత్రమే మెసేజ్​ చదవగలరు.

ప్లాట్​ఫామ్ కూడా ఆ మెసేజ్ యాక్సెస్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఫీచర్ తొలగిస్తే పంపిన మెసేజ్​లకు ఇకపై సేఫ్టీ ఉండదు. కంటెంట్ మోడరేషన్ లేదా ఇతర కారణాల వల్ల అవసరమైతే మెటా మీ మెసేజ్ చూడగలదు. ఇప్పటికే చాట్​లు ఎన్​క్రిప్ట్ చేసిన యూజర్లకు యాప్​లో నోటిఫికేషన్ వస్తుంది. పాత మెసేజ్​లు లేదా మీడియాను సేఫ్టీ కోసం గడువు తేదీ ముగియకముందే డౌన్​లోడ్ చేసుకోవాలని తెలిపింది.