V6 News

పిల్లలకు నో సోషల్ మీడియా.. అమల్లోకి వచ్చిన బ్యాన్

పిల్లలకు నో సోషల్ మీడియా.. అమల్లోకి వచ్చిన బ్యాన్

సిడ్నీ: ఆస్ట్రేలియాలో 16 ఏండ్లలోపు పిల్లలు సోషల్‌‌‌‌ మీడియా వాడకంపై నిషేధం అమల్లోకి వచ్చింది. కొద్దిరోజుల కింద అక్కడి ప్రభుత్వం చేసిన కొత్త చట్టం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం యూట్యూబ్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టా, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, స్నాప్‌‌‌‌చాట్‌‌‌‌, టిక్‌‌‌‌టాక్‌‌‌‌, ఎక్స్‌‌‌‌, రెడిట్‌‌‌‌, థ్రెడ్స్‌‌‌‌, ట్విచ్‌‌‌‌, కిక్‌‌‌‌ వంటి 10 ప్రధాన ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలో ఉన్న 16 ఏండ్లలోపు పిల్లల అకౌంట్లను ఆయా కంపెనీలే తొలగించాల్సి ఉంటుంది. లేదంటే ఒక్కో కంపెనీ రూ.280 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొత్త చట్టాన్ని ఉద్దేశించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ వీడియో మెసేజ్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేశారు. ఇది గర్వించదగిన రోజని చెప్పారు. ఈ చట్టం దేశంలో ఒక పెద్ద సామాజిక, సాంస్కృతిక మార్పుకు దారితీస్తుందన్నారు.