
హైదరాబాద్, వెలుగు: ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్డే బ్రేక్ పడింది. కొత్త కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా వచ్చే ఆదివారం బంద్ పెడుతున్నారు. ప్రతి వారం ఎంతో సందడిగా, వేలమంది సందర్శకులతో జరిగే సండే ఫన్డే ఈవెంట్ వచ్చేవారం నిర్వహించడం లేదని, ఈ విషయాన్ని మున్సిపల్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ బుధవారం తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్ బండ్ పై వెహికల్స్ వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.