ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తేనే భారత్‌‌తో చర్చలు జరుపుతాం

ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తేనే భారత్‌‌తో చర్చలు జరుపుతాం

కరాచీ: యూరీ, పఠాన్‌‌కోట్ ఎయిర్‌‌బేస్‌‌పై ఉగ్రదాడుల తర్వాత భారత్‌‌-పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. పుల్వామా దాడితో దాయాది దేశాల మధ్య సంబంధాలు మరితంగా దిగజారాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర్య ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, 35 (ఏ)ను రద్దు చేయడంపై పాక్ మండిపడుతోంది. తాజాగా ఈ అంశం గురించి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. జమ్మూ కశ్మీర్‌‌కు స్వయం ప్రతిపత్తిని తిరిగి పునరుద్ధరించేంత వరకు భారత్‌‌తో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌‌ను అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న భారత్‌‌తో తప్ప మరే దేశంతోనూ మాకు విరోధాలు లేవన్నారు.