ఆర్టీసీలో రెండేళ్లు నో యూనియన్స్.. ముందు పని చేయాలే

ఆర్టీసీలో రెండేళ్లు నో యూనియన్స్.. ముందు పని చేయాలే

‘ఇప్పుడు యూనియన్ వద్దు. ముందు పని చేద్దాం’ అని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. రెండేళ్లు యూనియన్లు లేకుండా పని చేద్దామని, తర్వాత ఇది మంచిగా లేదనిపిస్తే కార్మికుల ఇష్టమని హామీ ఇస్తున్నానని చెప్పారు. సమ్మె తర్వాత విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనియన్ ఎన్నికలను రెండేళ్లు పక్కనపెట్టేసి సంక్షేమ బోర్డు పేరుతో ఒక టీమ్‌ ఏర్పాటు చేసుకుని కార్మికులు కష్టసుఖాలు చెప్పుకోవాలన్నారు.

కార్మికుల మంచి చెడు చూసుకోవడానికి యూనియన్ల బదులు డిపోకు ఇద్దరు కార్మికుల చొప్పున ఎంపిక చేసుకుని 200 మందితో టీమ్‌ను ఏర్పాటు చేసుకుందామని సూచించారు సీఎం కేసీఆర్. ఈ టీమ్‌ను కో ఆర్డినేట్ చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఓ అధికారిని తాను నియమిస్తానని చెప్పారాయన. ఈ మొత్తం నెలకోసారి డిపో, డివిజన్, రీజియన్, రాష్ట్ర స్థాయిలో సమావేశమై సమస్యలపై చర్చించి తనకు నివేదించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం కేసీఆర్.

1000 కోట్ల ఆదాయంతో నడవాలి

ఉద్యోగులను తీసేసే మాటే ఉండదని, డిపో స్పేర్‌లో పెట్టడం లాంటివి ఉండవని, అందరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో పార్సిల్ సర్వీసు పెట్టాలని, దీని ద్వారా ఆదాయం పెంచాలని అన్నారు. కలర్ బ్లైండ్ నెస్ ఉన్న ఉద్యోగులను ఈ విభాగంలో పెట్టాలన్నారు. ఏడాది తిరిగేలోపు 1000 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ నడవాలని అన్నారు.

MORE NEWS:

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

నిద్రపోవడమే జాబ్.. జీతం లక్ష: ఇండియన్స్ అంతా అప్లై చేసుకోవచ్చు