నివాసాల మధ్య వైన్స్ షాపు వద్దు.. మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరి కలెక్టర్ కు వినతిపత్రం

నివాసాల మధ్య వైన్స్ షాపు వద్దు.. మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరి కలెక్టర్ కు వినతిపత్రం

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: ప్రజలు నివసిస్తున్న కాలనీలో వైన్స్​షాపు ఏర్పాటు చేయవద్దని సత్యనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కీసర మండలం రాంపల్లి ప్రధాన రోడ్డు నుంచి నాగారం వెళ్లే దారిలో సత్యనారాయణ కాలనీ రోడ్డు నంబర్ 2 లో కొత్త వైన్స్ షాపు ఏర్పాటు చేస్తున్నారన్నారు. స్కూళ్లు, హాస్పిటల్​, బస్ స్టాప్, మార్కెట్ కు దగ్గరలో, జనావాసాల మధ్య ఈ షాపు ఏర్పాటు చేస్తే అనేక మంది ఇబ్బంది పడుతారన్నారు. వెంటనే తొలగించాలని డిమాండ్​ చేశారు.