స్టాక్‌హోం: బుధవారం కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి ప్రకటనకు ముందే అవార్డు విజేత ల పేర్లు స్వీడిష్ మీడియాలో ప్రసారమయ్యాయి. ఆఖరి క్షణం వరకూ ఎంతో సీక్రెట్‌గా ఉండే నోబెల్ విజేతల పేర్లు ఇలా అధికారిక ప్రకటనకు ముందే లీక్ కావడంతో కలకలం రేగింది. ‘‘నోబెల్ విజేతల పేర్లతో ఒక ప్రెస్ నోట్ మీడియాకు అందింది. దీంతో విజేతల పేర్లు ముందే మీడియాలో ప్రసారమయ్యాయి. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం” అని నోబెల్ అకాడమీ సెక్రటరీ జనరల్ హన్స్ ఎలగ్రెన్ చెప్పారు.
